Situated in the heart of Vijayawada, the temple has been serving as a beacon of devotion for generationS!

Sri Venkateswara Swamy Temple, Labbipet, Vijayawada is a revered spiritual center dedicated to Lord Sri Venkateswara, the divine incarnation of Lord Vishnu and the eternal consort of Goddess Lakshmi. Rooted in faith, tradition, and devotion, the temple stands as a sacred place where devotees experience peace, divine grace, and spiritual fulfillment.

Sri Venkateswara Swamy Temple, Labbipet, Vijayawada.

శ్రీ కంచి కామకోటి పీఠస్థ శ్రీ వేంకటేశ్వర స్వామి – శ్రీ చంద్ర మౌళీశ్వర స్వామి వార్ల దేవస్థానము, వేంకటేశ్వరపురము , లబ్బిపేట విజయవాడ-10

క్షేత్ర విశిష్టత
“నడిచే దేవుడు” గా సుప్రసిద్దులైన శ్రీ కంచి కామ కోటి పీఠ 68 వ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పాద స్పర్శ సోకి నంతనే ఆ ప్రదేశము పునీతమగునని భక్తుల ప్రగాఢ విశ్వాసము.

అట్టి తపోధనులూ, నిష్టాగరిష్టులైన మహా స్వామి వారి దివ్య ఆశీస్సులతో అనుగ్రహించి యంత్ర స్థాపన గావింపబడిన హరి హర క్షేత్రమిది. అంతేకాక, మహాస్వామి వారు తమ శిష్యులైన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారిని కలుపుకొని స్వస్తి శ్రీ కీలక నామ సంవత్సరములో ఇచటనే చాతుర్మాశ్య దీక్ష జరిపినారు.

ఆదియేగాక, మహాస్వామి వారు అదే సంవత్సరము కార్తీక శుద్ధ సప్తమి, సోమవారము (28.10.1968) న పంచాయతన దేవతల ప్రతిష్ట జరిపి, తమ కరకమలములతో కుంభాభిషేకమును నిర్వహించినారు.

అది మొదలుగా దినదిన ప్రవర్ధమాన మగుచున్న ఈ క్షేత్రము ప్రస్తుతము నిత్య పూజలకూ, వ్రతములకూ, అర్చనలకూ, అభిషేకములకూ, వేదపఠనమునకూ, భక్తితో కూడిన లలిత కళలకూ నిలయమై అలరారుచున్నది.

మన ఋషులు, కొన్ని జంతువులను, నదులను, వృక్షములను దైవాంశ సంభూతులుగాను, దేవతామూర్తులుగాను ఆరాధించినారు. అట్టివి మన దేవాలయము పరిసరములలో ఉండుట వలన అధిక ప్రాశస్త్యము సంతరించుకున్నది. వానిలో గోమాత అతి పవిత్రమైనది. గోమాతలలో సకల దేవతలు కొలువై ఉంటారని, మన పురాణములు చెబుతున్నాయి. దైవపూజలు, అర్చనల ముందు గోపూజ జరుపుట పరిపాటి. గోగ్రాసము సమర్పించిన సకల పాపాలు తొలగునని భక్తుల విశ్వాసము.

దేవతా మూర్తుల విశిష్టత
వేద, శాస్త్త్రఘోషలు, వేదాధ్యయనాలు, విశేష అర్చనలు విరివిగా జరుగు ప్రాంతమున దేవతా మూర్తులు ద్విగుణీకృత శక్తి మంతులనుటకు అనేక దృష్టాంతములు గలవు.

I. కలియుగ దైవముగా ఆరాధించబడే శ్రీ వేంకటేశ్వరుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్భాంధవుడు, అనాధ రక్షకుడు, సర్వాపద నివారకుడు, సర్వ శుభ ప్రదాత.

భక్తులు తలచినదే తడవుగా అనుగ్రహించు, భక్తుల పాలిటి కొంగు బంగారముగా భాసిల్లు అలిమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వరుడు .

II. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపన తన లక్ష్యముగా భావించి, శరణాగతితో, తనను స్మరించు భక్తుల యోగక్షేమములను పరిరక్షించు రాధా కృష్ణులు.

III. భక్తి ప్రపత్తులు, ఆధ్యాత్మికచింతనతో జలము లేక మారేడు దళములను సమర్పించిన, అనుగ్రహ వర్షాన్ని కురిపించు భోళాశంకరుడుగా జగద్విదితమైన శ్రీ చంద్రమౌళీశ్వరస్వామి. ఒక్క బిల్వదళానికి అష్టైశ్వర్యములు ప్రసాదిస్తాడు.
IV. కోరిన వరాలిచ్చే సత్యదేవుడు.

V. దీన బాంధవుడు, కరుణా సముద్రుడుగా భాసిల్లు అభయప్రదుడు వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యస్వామి.

VI. అశ్వద్దవృక్షము ఛాయలో తొలి దైవముగా ఆరాధించబడే వరసిద్ది వినాయకుడు, సమర్ధత (దక్షత) కు ప్రతీకగా నిలిచిన కార్య సిద్ది హనుమ, జంటనాగులతో భాసిల్లు పుణ్య నిలయము.

ఇంతటి మహిమాన్విత దైవ క్షేత్రమున జరుగు శుభకార్యములకు దైవానుగ్రహము, వేదాశ్వీర వచనము లభించునని భక్తుల ప్రగాఢ విశ్వాసము.

శుభమస్తు శుభం భూయాత్.. సమస్త లోకాః సుఖినో భవంతు..

Sri Venkateswara Swamy Temple, Labbipet.

Over the years, the temple has evolved into an important spiritual landmark, preserving ancient Hindu traditions while nurturing a sense of unity and devotion among the community. The temple reflects the timeless belief that sincere prayer and surrender to Lord Venkateswara lead to protection, prosperity, and inner peace.

Scroll to Top